నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు మంగళవారం నంద్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం చేసి, జిల్లాలో పోలీస్ అధికారులు కూడళ్లలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేస్తూ, మోటార్ వాహనాలు చట్టం ప్రకారం నియమ నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.