ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్ అన్నారు. శనివారం గ్రామీణ ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితమవుతోందని వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మండలంలోని కాల్వబుగ్గ సీపీడబ్ల్యూఎస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, మాట్లాడారు. సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలన్నారు.