ఘనంగా హనుమాన్ జన్మ దినోత్సవ వేడుకలు

51చూసినవారు
ఘనంగా హనుమాన్ జన్మ దినోత్సవ వేడుకలు
మండల కేంద్రం గడివేములలో శనివారం నాడు హనుమాన్ జన్మ దినం సందర్భంగా స్థానిక పంచముఖి ఆంజనేయస్వామి ఆలయం నందు స్వామి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు కొండూరు ఆదినారాయణ శర్మ స్వామివారికి జలాభిషేకం నిర్వహించి అనంతరం పంచామృతాభిషేకం కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రత్యేక పూలతో అలంకరించి నైవేద్యం సమర్పించారు.

సంబంధిత పోస్ట్