ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని సీపీఎం కల్లూరు మండల కార్యదర్శి జె. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం కల్లూరులో ప్రజాపోరు నిర్వహించి, మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కరెంటు చార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో రూ. 18 వేల కోట్ల రూపాయలు భారాన్ని ప్రజలపై మోపడానికి సిద్ధపడిందని విమర్శించారు.