పాత కల్లూరులో 30 ఏళ్ల కిందట వేసిన ఐరన్ కరెంట్ పోల్స్ మార్చాలని ఇండస్ట్రీ స్టేట్ లోని ఏపీఎస్పీ డిసియల్ ఎలక్ట్రికల్ ఏఈకి సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం వినతిపత్రం ఇచ్చారు. శుక్రవారం సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుధాకరప్ప, శ్రీనివాసులు మాట్లాడారు. 30 ఏళ్ల కిందట ఐరన్ పోల్స్ వేశారని, ప్రస్తుతం ఆ పోల్స్ వర్షాలతో తుప్పు పట్టి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయన్నారు.