గడివేముల పోలీసుస్టేషన్ పరిధిలోని పెసరవాయి పోలీసు ఫ్యాక్షన్ పికెట్ ను జిల్లా ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ పార్థసారథి ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం గ్రామంలో ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ పార్థసారథి, ఎస్సై నాగార్జునరెడ్డితో కలిసి గ్రామస్తులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెసరవాయిలో పరిస్థితులపై సిబ్బందిని అడిగి తెలుసుకుని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.