ప్రభుత్వ భూములను అక్రమిస్తే చర్యలు తప్పవని పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్ అన్నారు. మంగళవారం దేవనకొండ క్రాస్ వద్ద వివాదస్పద భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందన్న ఫిర్యాదు మేరకు సర్వే చేస్తున్నామన్నారు. 597 సర్వే నంబర్ పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్ అని, ఆ సర్వే నంబర్ లో దేవదాయ భూమి, ప్రభుత్వభూమి ఉందన్న ఆరోపణ అవాస్తవమని ఆయన అన్నారు. తహసీల్దార్ లోకేశ్వరయ్య, డీటీ సుదర్శనం ఉన్నారు.