పత్తికొండ: కూటమి ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలి

77చూసినవారు
కూటమి ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వైసీపీ శ్రేణులకు సూచించారు. బుధవారం వెల్దుర్తి మండలం చెరుకులపాడులో ఆమె వైసీపీ శ్రేణులతో సమావేశమై, మాట్లాడారు. రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు చంద్రబాబు కర్షకులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు. ఈనెల 13న కర్నూలులో నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్