పత్తికొండలో అంగరంగ వైభవంగా ఉరుసు ఉత్సవం

909చూసినవారు
పత్తికొండ పట్టణంలోని చెరువు కట్ట కింద వరిమడిలో వెలసిన హజరత్ సయ్యద్ షా మొహమ్మద్ పీర్ మొహియుద్దీన్ స్వాముల వారి ఉరుసు మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముస్లిం వీధిలోని అషుర్ ఖాన్ నుండి ర్యాలీగా బయలుదేరి స్వామి వారి గలాఫ్‌ను దర్గాకు చేర్చారు. అనంతరం ప్రత్యేక ఫాతిహాలు నిర్వహించారు. దర్గా ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 30న జియరత్ ఫాతిహాలతో ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్