కర్నూలు జిల్లా శ్రీశైలం సి.ఐ రవీంద్ర, ఆత్మకూరు సెబ్ టీం సి.ఐ రామాంజనేయులు, శ్రీశైలం వన్ టౌన్, టు టౌన్ ఎస్.ఐ హరిప్రసాద్, పీరయ్య యాదవ్, సెబ్ ఎస్.ఐ దౌలత్ ఖాన్ అందరూ.. సిబ్బంది తో నాలుగు టీం లుగా విడిపోయి, సుండిపెంట లంబాడి కాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ మరియు సుండిపెంట అటవీప్రాంతంలో ఉన్న లోయలలో తనిఖీలు చేసి నాటుసారా బట్టీలు ధ్వంసం చేశారు.
పచ్చర్ల సెలలో 400 లీటర్ల బెల్లము ఊట ధ్వంశం చేసి కొర్ర వశ్యానాయక్ మీద కేసు నమోదు చేశారు. ఎదురు మట్టి సెల ప్రాంతంలో 300 లీటర్ల బెల్లము ఊట ధ్వంశం చేసి మూడవత్ గోపాల్ నాయక్ మీద కేసు నమోదు చేశారు. ఎలుగుబంటి సెల ప్రాంతంలో 900 లీటర్ల బెల్లము ఊట ధ్వంశం చేసి, పట్లావత్ వెంకటేష్ నాయక్ మీద కేసు నమోదు చేసి, అతని ఇంటి దగ్గర 20 లీటర్ల నాటుసారా సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. చాకిరేవు సెల దగ్గర 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంశం చేసి రామవత్ తులసీబాయి మీద కేసు నమోదు చేశారు.అలాగే కొర్ర చిట్టిబాయి ఇంటి దగ్గర 20 లీటర్ల నాటుసారా సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.
ఈ ఐదు కేసులలో 1900 లీటర్ల బెల్లము ఊట ధ్వంశం చేసి, 40 లీటర్ల నాటుసారా సీజ్ చేయడం జరిగింది. పట్లవత్ వెంకటేష్ నాయక్, రామవత్ తులసీ బాయి, కొర్ర చిట్టిబాయి లను అరెస్ట్ చేశారు.. మూడవత్ గోపాల్ నాయక్, కొర్ర వశ్యా నాయక్ ఇద్దరు పరారీలో ఉన్నారు.. వారిని త్వరలో అరెస్ట్ చేస్తాము అని డీ. ఎస్.పి వెంకట్రావు తెలిపారు.
డి యస్ పి వెంకట్రావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే శాఖను ఏర్పాటు చేసి మద్యం, నాటుసారా, ఇసుక మీద గట్టి నిఘాను ఉంచింది కాబట్టి సుండిపెంట ప్రాంతంలో నాటుసారా, మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము. త్వరలో నాటుసారా తయారీ దారులు, అమ్మకం దారులమీద బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది.. నాటుసారా తయారీ, అమ్మకాలకు అలవాటుపడిన నేరస్తుల మీద సస్పెక్ట్స్ షీట్లు తెరవడం జరుగుతుంది.. అవసరం అయితే పి.డి యాక్ట్ కూడా ప్రయోగించడానికి వెనుకాడం అని హెచ్చరించారు.