ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని శనివారం రోజున అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ శాలురెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఏడీ శాలురెడ్డి మాట్లాడుతూ...గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం... రైతు భరోసా కేంద్రం ప్రారంభంతో సాకారమైందని, ఇక రైతులు పనులు వదిలి పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, రైతు భరోసా కేంద్రంలో భూసార పరీక్ష మొదలుకుని రైతులకు కావలసిన అన్ని రకాల విత్తనాలు, ఎరువు మందులు,రైతులు విత్తనాలను రైతులు ఇక్కడే కొనుగోలు చేయొచ్చన్నారు.
విత్తిన 15 రోజుల తర్వాత రైతు భరోసా కేంద్రంలో పంట నమోదు చేసుకోవలని..అలా చేసుకుంటేనే ఏదైనా విపత్కర పరిస్థితుల్లో రైతులకు రావాల్సిన పంట నష్టం పరిహారం అందుతుందని..పంట నమోదు చేసుకోని రైతులకు గవర్నమెంట్ జవాబుదారీ కాదని రైతులకు తెలియజేశారు. రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ తో పాటు ఆర్టీ కల్చర్,సిరికల్చర్,పశు సంవర్థక శాఖ,మచ్చ శాఖ, రైతులకు అనుభంధ సంస్థలన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ముందుగా నమోదు చేసుకున్న రైతులకు సబ్సిడీ కింద పిల్ల పెసర,జీలుగ విత్తనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి, కురుకుంద వైయస్ఆర్ సిపి నాయకులు శంకరెడ్డి, ఎమ్మార్వో, ఇంకా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.