ప్రతిభా అవార్డుకు గ్రహణం: జవహర్ నాయక్

437చూసినవారు
ప్రతిభా అవార్డుకు గ్రహణం: జవహర్ నాయక్
2019 విద్యా సంవత్సరంలో ప్రతిభా అవార్డులు సాధించిన విద్యార్థులకు 20వేల రూపాయలు నగదు ట్యాబ్ ఇవ్వాలని గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జవహర్ నాయక్ గురువారం ప్రభుత్వాన్ని కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను విద్యలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పీ.జే అబ్దుల్ కలాం జన్మదినోత్సవం అక్టోబర్ 15వ తేదీన పదో తరగతి పరీక్షలో విద్యార్థులు సాధించిన జి .పి .ఏ ఆధారంగా బాలబాలికలకు డాక్టర్ ఏ.పి.జే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ అవార్డులు ప్రధానం చేస్తారు.

ప్రతి మండలానికి 6 మంది విద్యార్థులకు ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రతిభా అవార్డు పొందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 20 వేల రూపాయలు నగదు ట్యాబ్ ప్రశంసాపత్రం ఇస్తారు. ఈ అవార్డులు జిల్లా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో జిల్లా స్థాయిలో విద్యార్థులకు ప్రధానం చేస్తారు. ఐతే 2019 సంవత్సరానికి గాను మండల స్థాయిలో 6 మందికి జిల్లా స్థాయిలో 322 మందికి రాష్ట్రములో మొత్తం 3,983 మంది బాలబాలికలకు ప్రతిభా అవార్డును ప్రకటించారు.

అయితే నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రధానం చేశారు. ఒక్క ప్రశంసా పత్రం మాత్రమే ఇవ్వటం జరిగింది 20 వేల రూపాయలు నగదు ట్యాబ్ ఇంతవరకూ విద్యార్థులకు ఇవ్వలేదు దీనితో కృషి పట్టుదలతో చదివి ప్రతిభా అవార్డు సాధించిన విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. నగదు ట్యాబ్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు కావున విద్యార్థులకు మంజూరు చేయడానికి అధికారులు చొరవ చూపి వెంటనే అందేటట్లు చూడాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్