విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం

7143చూసినవారు
ఆత్మకూరు పట్టణంలోని రఘునాథ్ సెంటర్ సమీపంలో గల ఓ పాత సామాన్ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంబంధించి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు అధికమవడంతో అగ్నిమాపక కేంద్ర వాహనం అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసింది. ఇదిలా ఉంటే దుకాణంలో పాత సామాను అధికంగా ఉండడంతో భారీగా మంటలు వ్యాపించాయి. నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోతున్నాడు.

సంబంధిత పోస్ట్