మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం ఆదాయం రూ. 2,21,23,830 వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్. శ్రీనివాస్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ మహానందీశ్వర స్వామివారికి వివిధ రకాల ఆర్జిత సేవలు, దర్శనం టికెట్ల ద్వారా 2024 సంవత్సరం ఈనెల రూ. 2,21,23,830 వచ్చిందన్నారు. గత సంవత్సరంలో 2023లో రూ. 1,73,39,091 ఆదాయం వచ్చిందన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 50 లక్షలు పైగా ఆదాయం పెరిగిందన్నారు.