డూ డూ బసవన్నా ఇటు రారా బసవన్నా. అమ్మవారికి దండంపెట్టూ అయ్యకి దండం పెట్టు మన సుబ్బుకి దండం పెట్టూ రారా బసవన్నా రారా బసవన్నా అంటూ గంగిరెద్దులాట మన సంస్కృతిలో ఓ భాగం. సంక్రాంతి వచ్చిందంటే చాలు గంగిరెద్దులాటలతో పల్లెలన్నీ సందడిగా మారుతాయి. గంగిరెద్దుల సందడి డూడూ బసవన్నల విన్యాసాలతో గ్రామాలు సందడిగా మారుతున్నాయి. ఆత్మకూరులో పండుగ సందర్భంగా బుధవారం గంగిరెద్దులాట నిర్వహించారు.