పరిపాలనలో రెవెన్యూ సేవలు ఎంతో కీలకం

84చూసినవారు
పరిపాలనలో రెవెన్యూ సేవలు ఎంతో కీలకం
ప్రజా పరిపాలనలో రెవెన్యూ శాఖకి సేవలు ఎంతో కీలకమని ఆత్మకూరు తాసిల్దార్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు ముందు నుంచి భారతదేశంలో రెవెన్యూ సేవలు మొదలయ్యాయి అని తెలిపారు. తమ శాఖ సేవలను గుర్తిస్తూ ప్రత్యేక దినోత్సవం కేటాయించడం సంతోషకరమన్నారు.

సంబంధిత పోస్ట్