విద్యార్థులకు ముఖ్య గమనిక

84చూసినవారు
విద్యార్థులకు ముఖ్య గమనిక
తెలంగాణలో బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మెరిట్ ప్రకారం సీట్ల భర్తీకి రెండో జాబితా విడుదలైంది. ఈ మేరకు టీజీఆర్ డీసీ సెట్-2024 కన్వీనర్ బడుగు సైదులు గురువారం ఓ ప్రకటనలో ప్రకటించారు. సీట్ల కేటాయింపు వివరాలు https://tgrdccet.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. సీట్లు కేటాయించబడిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీ లోగా సంబంధిత కాలేజీల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్