దోర్నాల మండలంలోని నల్లమల అటవీ ప్రాంతం బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇష్టకామేశ్వరి ఫారెస్ట్ గేట్ వద్ద పాదచారులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మహిళలతో పాటు ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భక్తులను ఢీకొట్టిన తర్వాత కారు రోడ్డు పక్కకు దూసుకు వెళ్ళింది.