ఎమ్మిగనూరు: ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి

55చూసినవారు
ఎమ్మిగనూరు: ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని, ప్రజలపై భారాలు మోపే ప్రభుత్వాలపై వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మిగనూరులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల భారాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 29, 30 తేదీల్లో సీపీఎం మహాసభలు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్