ఎమ్మిగనూరు పట్టణంలో సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం ఎమ్మిగనూరులో అవగాహన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్ కు వచ్చే తెలియని లింక్ లు క్లిక్ చేయవద్దని విద్యార్థులకు, ప్రజలకు సూచించారు. ఏ బ్యాంకు వాళ్లు ఒటీపిలు అడగరని అప్రమత్తంగా ఉండాలన్నారు.