ప్రభుత్వ హాస్టల్లో పరిశుభ్రత తప్పక పాటించాలని, ఇలా అపరిశుభ్రంగా ఉంటే ఎలా అని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కోసిగిలోని ఇంటిగ్రెటెడ్ హాస్టల్ ను తనిఖీ చేసి, వార్డెన్ కోటేశ్వరయ్య లేకపోడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ ఆవరణంలో నిలిచిన మురుగునీటిని పరిశీలించారు. హాస్టల్ కు మెట్లు సరిగ్గా లేకపోవడంతో ఎలా నడవాలని అధికారులను ప్రశ్నించారు.