ఎమ్మిగనూరు: పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చోరీ

77చూసినవారు
ఎమ్మిగనూరు: పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చోరీ
ఎమ్మిగనూరు పట్టణంలోని సాయిగణేష్ కాలనీలో గురువారం పట్టపగలే ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. టి. రమణగౌడ్ కుటుంబ సభ్యులతో కలసి ఇంటికి తాళం వేసి నీలకంఠేశ్వరస్వామి జాతరకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటితాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 2 తులాల బంగారు అభరణాలను అపహరించారు. జాతర నుంచి ఇంటికొచ్చిన యజమానికి తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్