ఎమ్మిగనూరు పట్టణంలోని హజరత్ బడే సాహెబ్ దర్గా నుంచి ఎంబీ చర్చి వరకు, అంబేడ్కర్ విగ్రహం నుంచి ఆదోని బైపాస్ వరకు రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డుకు శుక్రవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి భూమి పూజచేసి, పనులకు స్వయంగా జేసీబీ నడిపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి దివంగత నాయకులు బీవీ మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచి, సమస్యలను పరిష్కరిస్తానన్నారు.