రాష్ట్రంలో ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వాగు కోతకు గురై విజయవాడలోని అజిత్ సింగ్ కాలనీ, తోటవారి వీధి, న్యూ రాజేశ్వరి పేట, సుందరయ్య నగర్, రోటరీ నగర్, నందమూరి నగర్, సితార సెంటర్ తదితర కాలనీలు వరద ముంపుకు గురై సుమారు లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులైనారు. సీఎం చంద్రబాబు పిలుపుకు వరద బాధితుల కోసం గోనెగండ్ల మండల టిడిపి నాయకులు రూ.1,67,000 సీఎం సహాయ నిధికి మంగళవారం పంపారు.