TG: షర్మిల, చంద్రబాబు చేతిలో పప్పెట్ లా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్ తో పోటీ పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎందుకంటే, YSR మరణం తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి చేసిన కుట్రల వల్ల జగన్ దాదాపు 16 నెలలు జైళ్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీతో ఆమె కలిశారని మండిపడ్డారు.