రేపు వైజాగ్‌ బీచ్‌ను శుభ్రం చేయనున్న లావణ్య త్రిపాఠి

58చూసినవారు
రేపు వైజాగ్‌ బీచ్‌ను శుభ్రం చేయనున్న లావణ్య త్రిపాఠి
వివాహం అనంతరం లావణ్య త్రిపాఠి నటిస్తోన్న తెలుగు వెబ్‌ సిరీస్‌ ’మిస్‌ పర్‌ఫెక్ట్‌‘. బిగ్‌ బాస్‌ విన్నర్‌ అభిజిత్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 2న డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా, నేషనల్ క్లీన్లినెస్‌ డేను పురస్కరించుకొని ఆదివారం విశాఖ బీచ్‌లో క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఇందులో లావణ్య త్రిపాఠి పాల్గొననుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్