ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ కోరిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తే భవిష్యత్‌లో భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీల్లో పాల్గొనబోమని పాక్ క్రికెట్ బోర్డు చెప్పింది. ఈ విషయమై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. పాక్‌కు ఇష్టం లేకపోతే భారత్‌కు రావొద్దు.. వాళ్లు రాకపోతే తమకేలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.