టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన భార్య సాక్షితో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు చాలా సమయం ఉండడంతో ప్రస్తుతం ఆయన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికులతో కలిసి ధోని, సాక్షిలు ప్రముఖ జానపద గీతం ‘గులాబి షరారా’కు ఆనందంగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.