ఏపీలోని వరద బాధితులకు ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం LG ఎలక్ట్రాన్సిక్ గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితులకు ఉచిత సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. వరద నీటిలో తడిచిన LG ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఉచిత సర్వీస్ అందిస్తామని తెలిపింది. స్పేర్ పార్టులపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.