శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలకళ సంతరించుకోవడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. రేపు శ్రీశైలం జలాశయాన్ని సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. వరద ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.