ఏపీలో నూతన మద్యం పాలసీ అమలు కావడంతో వైన్స్ షాపులు కిటకిటలాడుతున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో రూ.541 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 6,77,511 కేసుల లిక్కర్, 1,94,261 కేసుల బీర్లు అమ్ముడయ్యాయని అధికార వర్గాల లెక్కలు చెబుతున్నాయి. మూడు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖ రూ.77 కోట్ల విలువైన అమ్మకాలు జరిపింది. ఇదే తీరున మద్యం ఊపు కొనసాగితే ఏపీకి కాసుల పంటే.