టీడీపీలోకి కుప్పం వైసీపీ నేతలు..!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు.. టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. మరికొందరు పార్టీ నుంచి జంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటు కుప్పంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. కుప్పం వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.