కేసరపల్లిలో భారీగా ఏర్పాట్లు

55చూసినవారు
కేసరపల్లిలో ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 80 అడుగుల వెడల్పు.. 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజ్‌ను నిర్మించారు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజల కోసం గ్యాలరీలను ఏర్పాటు చేశారు.ఢిల్లీ నుంచి ఉదయం 10.40కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. కాసేపట్లో నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్