ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. ఆయన పదవీకాలం 2028 జూన్ 21తో ముగియనుండగా నేడు పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. ఈ స్థానానికి ఎన్నిక జరిగితే అది కూటమి అభ్యర్థికే దక్కుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయితే ఈ స్థానాన్ని చిరంజీవి, నాగబాబులలో ఒకరికి ఇచ్చి రాజ్యసభకు పంపాలని కూటమి పెద్దలు భావిస్తున్నారట.