AP: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ముంబయిలోని పోవై లేక్ లో నిర్వహిస్తున్న దక్షిణాసియా హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ లో ఇవాళ మంత్రి పాల్గొననున్నారు. రాష్ట్రానికి ఆతిథ్య రంగంలో భారీ పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కృషి చేయనున్నారు. ఈ వర్క్ షాప్ లో మంత్రి దుర్గేష్‌తోపాటు అధికారులు అజర్ జైన్, అమ్రపాలి కూడా పాల్గొనున్నారు.