AP: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో పర్యటించిన మంత్రి నిమ్మల రామనాయకుడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.1.26 కోట్లతో అప్పన్నచేరువు, పెనుమదంలో పంట కాలువలు, డ్రైనేజీల వెంబడి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్వయంగా మోటార్ సైకిల్ నడుపుకుంటూ రైతులు, కూటమి నాయకులతో మంత్రి నిమ్మల పర్యటించారు.