ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చిన పాపానికి జగన్ వ్యవస్థలన్నింటితోపాటు దేవాలయాల ప్రతిష్ఠను నాశనం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. తిరుమల ఆలయానికి ఘోర అపచారం చేసి, దేశప్రజల మనోభావాలు, విశ్వాసాన్ని జగన్ దెబ్బతీశారని దుయ్యబట్టారు. కల్తీ నెయ్యి వివాదంలో సంబంధం ఉన్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని హెచ్చరించారు. జగన్, ఆయన పార్టీపై విశ్వాసం లేకనే నాయకులు వైసీపీని వీడుతున్నారని అన్నారు.