AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు సోమవారం హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కొలికపూడి శ్రీనివాసరావు వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. సొంత పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దాంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే వ్యవహారశైలిపై వివరణ కోరనుంది.