అకౌంట్‌లో డబ్బులు జమ

408506చూసినవారు
అకౌంట్‌లో డబ్బులు జమ
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులను విడుదల చేసినట్లు సీఎం జగన్ చెప్పుకొచ్చారు. మంగళవారం ఐదో విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు వర్చువల్‌గా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన 10,132 జంటలకు రూ.78.53 కోట్లు సాయం అందిస్తున్నామన్నారు. వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్ల వయసు ఉండాలని నిర్దేశించామని సీఎం జగన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్