మరింత సౌకర్యవంతంగా టీటీడీ సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి

80చూసినవారు
మరింత సౌకర్యవంతంగా టీటీడీ సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు శ్రీవారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్