కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి భారీగా నిధులు కేటాయించడం పట్ల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అనాథలా మారిందన్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నమ్మిన తమ అధినేత పవన్ కళ్యాణ్ కల నేడు నేరవేరిందని అన్నారు. కూటమిని గెలిపించిన ఆంధ్ర ప్రజలను విశ్వసించి రాష్ట్రానికి నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.