నాగబాబుకు ఎమ్మెల్సీ.. ఆ తర్వాత మంత్రి పదవి?

81చూసినవారు
నాగబాబుకు ఎమ్మెల్సీ.. ఆ తర్వాత మంత్రి పదవి?
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కేబినెట్లోకి తీసుకునేందుకు మార్గం సుగమమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు కానుంది. ఆ తర్వాత ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ఉగాది పండుగ తరువాత సీఎం చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేపట్టి నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్