ఆదోని డివిజన్ డీఎస్పీగా హేమలత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన హేమలత 2022-26 గ్రూప్-1లో సెలెక్ట్ అయి, ట్రైనింగ్ పూర్తిచేసి డీఎస్పీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటానని, ప్రజలు ఏమైనా సమస్యలుంటే నేరుగా తనను కలవవచ్చునని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.