ఆదోని: ఎస్హెచ్ఆర్సి, లోకాయుక్తను తరలించొద్దు
By NIKHIL 83చూసినవారుకర్నూలు నుంచి ఎస్హెచ్ఆర్సి, ఏపీ లోకయుక్త కోర్టులను తరలించొద్దని ఆదోని బార్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎల్. కె. సుందర్ సింగ్, ఉపాధ్యక్షుడు మొలగవల్లి జనార్థన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆదోనిలోని అసొసియేషన్ కార్యాలయంలో మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి, సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈనెల 22వరకు విధులను బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేశారు.