అహోబిలం నుంచి హైదరాబాదుకు ప్రయాణమైన పీఠాధిపతి

72చూసినవారు
ఆళ్లగడ్డ మండల పరిధిలో గల అహో బిలంలో ఉగాది పండుగ వేడుకలలో పాల్గొనేందుకు వచ్చిన 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆలయంలో పూజల అనంతరం మంగళవారం హైదరాబాద్ కు ప్రయాణం అయ్యారు. వేద పండితులు ఆయనకు మర్యాదలు సమర్పించి వీడ్కోలు పలికారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ రోడ్డులో ఉన్న అహోబిలమఠం శాఖలో విడిది చేయనున్నారు. శ్రీ స్వామివారి వాహనం వెంట భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్