ఆస్పరి మండల పరిధిలోని ముత్తుకూరు గ్రామంలో తాగునీరు పైపు పగిలి వృధాగా పోతున్నాయని స్థానికులు గురువారం ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ఈ సమస్య ఉన్న పంచాయతీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. లీకైనా నీరు రోడ్లపైనే ప్రవహిస్తున్నాయని, దీనివలన దోమలు బారిన రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరమ్మత్తులు చేయించాలని కోరుకుంటున్నారు.