ఆలూరు మండలం హులేబీడు గ్రామంలో ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఎంఈఓ సందర్శించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పాఠశాలలో మౌలిక వసతులు లేవని ఆమెకు తెలియజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ, విద్యార్థులకు సరిపడ గదులు, బాత్రూంలు, త్రాగునీరు లేవన్నారు. 60 మంది విద్యార్థులకు ఒకరే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఇలా ఉంటే పిల్లలు భవిష్యత్తు ఎలా అని నిలదీశారు. వెంటనే మా పాఠశాలకు డీఈఓ శామ్యూల్ రావాలని వారు డిమాండ్ చేశారు.