ఆలూరు: యురేనియం తవ్వకాలపై కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత
కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం కప్పట్రాళ్ల స్టేజి వద్ద శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. యురేనియం తవ్వకాలపై గ్రామస్తులు నిరసనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. దీంతో బళ్లారి - కర్నూలు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నిరసన తెలుపుతున్న ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే విరుపాక్షి ధర్నాలో పాల్గొన్నారు. మద్దతు పలికేందుకు వస్తున్న ఎమ్మెల్యేకు పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు.