బనగానపల్లె స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజిక సత్యప్రపూర్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 22వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 23న ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు.