ఉప్పలపాడు వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఉత్తమ సేవలు అందించినందుకు గురువారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమసేవ పురష్కరం అందుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నంద్యాలలో అవార్డు అందుకున్నారు. తనకు ఈ పురస్కారం రావడంతో ఇంకా బాధ్యతలు పెరిగాయని, మున్ముందు కూడా ఇంకా ఉత్తమ సేవలు అందిస్తానని తెలిపారు.